నిర్మల్ జిల్లాకు కోటి రూపాయల రివార్డు
NRML: జాతీయ స్థాయి జల అవార్డుల్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల విభాగంలో నిర్మల్ జిల్లా రెండవ స్థానంలో నిలవడం గర్వకారణమని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లాకు కోటి రూపాయల రివార్డు లభించడం విశేషమని తెలిపారు. అధికారుల సమిష్టి కృషి, ప్రజల విలువైన భాగస్వామ్యంతోనే ఈ ఘనత సాధ్యమైందని గురువారం ప్రకటనలో వారు పేర్కొన్నారు.