ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్యాధికారి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్యాధికారి

JGL: కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్స్ రికార్డులను పరిశీలించారు. ఫార్మసీ రూమ్‌లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని, మందులను ఎక్స్పైరీ డేట్ చూసుకుంటూ పేషెంట్స్‌కి ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఇమ్యునైజేషన్ గదిని పరిశీలించారు.