వడ్లమూడి అడ్డరోడ్డులో ట్రాఫిక్‌తో నిత్య నరకం

GNTR: చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి అడ్డరోడ్డు వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని గురువారం ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వడ్లమూడి గ్రామాల నుంచి వచ్చే వాహనాలతో ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుందని వాపోతున్నారు. ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడమే సమస్యకు ప్రధాన కారణమని ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.