నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నిర్మల్: జిల్లాలోని బంగల్ పేట్ ఫీడర్ మరమ్మతుల నేపథ్యంలో శనివారం పట్టణంలోని పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏడిఈ పి.రవి తెలిపారు. అగ్రికల్చర్ మార్కెట్ ఏరియా, మోచి గల్లీ, బుధవార్ పేట్, గాంధీచౌక్, కబూతర్ కమాన్, బంగల్ పేట్, నాయుడివాడ, బోయవాడ, రాంరావ్ బాగ్ తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు సహకటించాలని పేర్కొన్నారు.