క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక పరీక్ష

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక పరీక్ష

NLG: తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలైన హకీంపేట (హైదరాబాద్), కరీంనగర్, ఆదిలాబాద్‌లలో 4వ తరగతి ప్రవేశాల కోసం మండల స్థాయి ఎంపిక పరీక్షలు ఈ నెల 16, 17 తేదీల్లో కట్టంగూరు జే.ఉ.పాఠశాలలో ఉ. గం.9 లకు ఈ పరీక్షలు నిర్వహిస్తారని ఎంఈవో అంజయ్య తెలిపారు. విద్యార్థులు ఐదు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ జిరాక్స్, 3వ తరగతి పాస్ సర్టిఫికెట్‌తో హాజరు కావాలన్నారు.