సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం
NZB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ సిందూర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సోమవారం మోస్రాలో బీజేపీ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మండల అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.