నేటి నుంచి జిల్లాకు వర్ష సూచన
ASR: రాష్ట్రంలోని పలు జిల్లాలో అకాల వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావం కారణంగా నేటి నుంచి ఈ నెల 21 తేదీ వరకు అల్లూరి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వర్షాలతో మండుటెండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది.