జిల్లాలో 600కు పైగా రోడ్డు ప్రమాదాలు
గుంటూరు: జిల్లాలో ఈ ఏడాది 600కుపైగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, హెల్మెట్/సీట్‌బెల్ట్ లేకపోవడం ముఖ్య కారణాలుగా గణాంకాలు వెల్లడించాయి. ప్రత్యేకంగా మధ్యాహ్నం 3-6, సాయంత్రం 6-9 గంటల మధ్య ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రమాదాలు జరిగే టాప్-100 జిల్లాల్లో గుంటూరుకు 71వ స్థానం దక్కింది.