బుడవేరు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

NTR: బుడమేరు కాలువలు ముప్పు కలిగిస్తాయనే వదంతులు అసత్యమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. కండ్రిక నుండి గుణదల 33 తూముల వరకు కాలువలను శుక్రవారం పరిశీలించారు. గతంలో నిర్లక్ష్యం కారణంగా సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో రూ.3000 కోట్లతో ఆధునీకరణ జరపడంతో ఇకపై శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు.