సీఎస్ఐ చర్చిలో కానుకల పండుగ
KNR: హుజూరాబాద్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో ఆదివారం భక్తి శ్రద్ధలతో కృతజ్ఞతల కానుకల పండుగ ఘనంగా నిర్వహించారు. కానుకల పండుగ పురస్కరించుకొని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, కోలాటం, ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సోల్లు బాబు, కమిటీ సభ్యులు శైలజ, పద్మ, ఝాన్సీ, రిషిక, ప్రియా, బ్యులా, సునీత, సురేఖ, ప్రభావతి తదితరులు ఉన్నారు.