JCB ఢీకొని వ్యక్తి మృతి

JCB ఢీకొని వ్యక్తి మృతి

ప్రకాశం: JCB ఢీకొని శనివారం రాత్రి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి వివరాలను ఎస్సై ఫిరోజ్ ఫాతిమా తెలియజేశారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రెడ్డిపాలానికి చెందిన చేవూరి అనిల్ కుమార్ (36) పని నిమిత్తం బైక్‌పై ఎర్రగొండపాలెం వస్తున్నారు. ఆ సమయంలో వేగంగా వస్తున్న బైకును జేసీబీ వెనకవైపు ఉన్న కొండి ప్రమాదవశాత్తు తగలడంతో కింద పడి మృతి చెందాడు.