మరి కాసేపట్లో 'హరిహర వీరమల్లు' ఫ్రీ షో

కృష్ణా: విద్యార్థుల్లో చరిత్రపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో 'హరిహర వీరమల్లు' సినిమాను ఉచితంగా ప్రదర్శించనున్నట్లు AMC ఛైర్మన్ గరికిపాటి శివశంకర్ తెలిపారు. ఆదివారం ఉదయం 7:45కి బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లోని కృష్ణా థియేటర్లో ఈ సినిమా ప్రదర్శన ఉంటుందని చెప్పారు. విద్యార్థులు చిత్రాన్ని తిలకించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.