VIDEO: CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. సోమవారం పెదపారుపూడి మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వెంట్రప్రగడ గ్రామంలో వెలగపూడి దుర్గారాణి గృహానికి వెళ్లి 78,213 రూపాయల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందించారు. దీంతో ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.