ఎట్టకేలకు రాకపోకలకు అనుమతి

ఎట్టకేలకు రాకపోకలకు అనుమతి

VZM: గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఆర్.యూ.బీ మునిగిపోవడంతో రహదారిని మూసివేశారు. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు చుట్టూ తిరిగి రాకపోకలు సాగించారు. రైల్వే అధికారులు విశాఖపట్నం నుంచి ప్రత్యేక మోటార్లు రప్పించి నాలుగు రోజులు రేయింబవళ్ళు తీవ్రంగా శ్రమించి మంగళవారం మార్గం సుగుమం చేసారు. మార్గం సుగమం అవ్వడంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేశారు.