చేబ్రోలులో కోట్లమ్మ అమ్మవారి సంబరాలు

ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదివారం కోట్లమ్మ అమ్మవారి సంబరాలు ఘనంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీటీసీ సభ్యులు మనసాల నాగమణి, రాయి లక్ష్మి పాల్గొన్నారు.