గంజాయి కలకలం.. రూ. 10లక్షల సరుకు స్వాధీనం
NTR: జిల్లాలోని ఈగల్ టీమ్ సహకారంతో గన్నవరం డీఏస్పీ టీమ్, గన్నవరం హైవేపై విశాఖపట్నం-చెన్నై వెళ్తున్న లారీని తనిఖీ చేశారు. లారీలో సుమారు రూ. 10 లక్షల విలువైన 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గంజాయి రవాణాపై సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రజలను కోరారు.