అగ్ని ప్రమాదం.. రెండిళ్లు దగ్ధం
BDK: మంగవైబాడావ గ్రామంలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. కల్లూరి వెంకటమ్మ ఇంట్లో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ముద్దరాజు ఇంటికి వ్యాపించాయి. ఈ ఘటనలో రెండిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. నగదు, బంగారం, దుస్తులు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.6 లక్షల నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. బాధితులు ప్రభుత్వ సహాయం కోరుతున్నారు.