జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు రాజోలు విద్యార్థి

జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు రాజోలు విద్యార్థి

కోనసీమ: జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు రాజోలు హైస్కూల్ పాఠశాల విద్యార్థి పి. జస్వంత్ శ్రీనివాస్ ఎంపికయ్యాడని పాఠశాల హెచ్ఎం కె.సరస్వతి మంగళవారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 బాలుర విభాగంలో శ్రీనివాస్ కాంస్య పథకం సాధించాడన్నారు. జనవరి 8న మణిపూర్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటాడన్నారు.