జిల్లాలో ఘోర ప్రమాదం.. ఒకరి మృతి
NLG: చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ గేట్ సమీపంలో హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లేపల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు, హైదరాబాద్ నుంచి మల్లేపల్లి వైపు వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.