50వ డివిజన్ రోడ్లు బాగు చేయాలి: సీపీఐ నేత మేకల
KMM: ఖమ్మం నగరంలోని 50వ డివిజన్ రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారాయని సీపీఐ డివిజన్ కార్య దర్శి మేకల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాలు జరుగుతున్నా ఆర్అండ్ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు.