ఈనెల 24న గద్దెల పునః ప్రతిష్ఠ
MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్న గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను ఈనెల 24న పునః ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పూజారులు తెలిపారు. గద్దెల పునర్నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ తేదీని ఖరారు చేశారు. ఈ సందర్భంగా గురువారం గోవిందరాజు గద్దెను పూజారులు కదిలించారు. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి భక్తులు పాల్గొన్నాలని కోరారు.