శ్రీశైలంలో తప్పిన పెనుప్రమాదం
NDL: దోర్నాల సమీపంలో సోమవారం ఓ టూరిస్ట్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. భవాని మాలదారులు 40 మందికి పైగా భక్తులు విశాఖపట్నం నుంచి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని శ్రీశైలం బయలుదేరారు. ఉదయం దోర్నాల చెక్ పోస్ట్ దాటిన తర్వాత, ప్రమాదవశాత్తు బస్సు రహదారి పక్కన ఉన్న ప్రహరీ ఎక్కి నిలిచిపోయింది. గోడపై ఆగకుంటే బస్సు లోయలో పడి భారీ ప్రమాదం సంభవించేది.