అభివృద్ధి పనులపై సమీక్షించిన ఎమ్మెల్యే
W.G: చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రోషన్ కుమార్, కలెక్టర్ వెట్రిసెల్వి నిన్న సమీక్షించారు. ఈ భేటీలో ఇంజనీరింగ్ అధికారులు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, ప్రజా అవసరాల మేరకు కొత్త పనులను ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు.