మతసామరస్యాన్ని చాటిన షేక్ అఖిల్
NLG: మునుగోడు మండలంలోని దుబ్బకాలువ గ్రామానికి చెందిన షేక్ అఖిల్ అయ్యప్ప మాలధారణ స్వాములకు ఇవాళ అన్నదానం చేసి మతసామరస్యాన్ని చాటారు. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మాల ధరించిన స్వాములకు అన్న సమర్పణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరేళ్ల సైదులు, శివ, చారి తదితరులు పాల్గొన్నారు.