నిద్రలేవడానికి అలారం పెట్టుకుంటున్నారా?

నిద్రలేవడానికి అలారం పెట్టుకుంటున్నారా?

ఉదయం నిద్రలేవడానికి అలారం పెట్టుకుంటే ప్రమాదంలో పడ్డట్లేనని అధ్యయనాలు చెబుతున్నాయి. అలారం మోతతో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ముప్పును పెంచుతుందని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అలారం వచ్చినప్పుడు బలవంతంగా నిద్రలేవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుందని తేలింది. అలాగే అలారం శబ్దం శరీరంలో ఒత్తిడిని ప్రేరేపిస్తుందట.