రోజు రోజుకి జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత
NGKL: జిల్లాలో చలిపులి పంజా విసురుతోంది. రోజురోజుకి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. వెల్దండ మండలంలో అత్యల్పంగా 13డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రత నమోదయ్యింది. తోటపల్లి, ఎల్లికల్, ఊర్కోండ, బిజినపల్లి, తెలకపల్లి, యంగంపల్లి వంటి గ్రామాల్లో 15 డిగ్రీలలోపై ఉష్ణోగ్రతలు పడిపోయాయని వాతవరణ శాఖ పేర్కొంది.