మహిళా సంఘానికి నూతన కమిటీ ఎన్నిక

ASR: డుంబ్రిగుడ మండల మహిళా సంఘానికి నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నిక చేశారు. ఈ ఎన్నికలు మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. హైమావతి పర్యవేక్షణలో జరిగాయి. ఈ సందర్భంగా పాంగి సునీత అధ్యక్షురాలిగా కే. మాలతి కార్యదర్శిగా, డీ. ఈశ్వరమ్మ కోశాధికారిగా ఎన్నికయ్యారు. అదనంగా మరో పదిమంది సభ్యులు కూడా కమిటీలోకి ఎన్నికయ్యారు.