చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారి

చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారి

ASR: అరకులోయ మండలం చొంపి నుంచి గత్తనగుడకు వెళ్లే ప్రధాన రహదారి చెరువుని తలపిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా రహదారిపై గోతులు ఏర్పడి ఆదివారం కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరు గోతుల్లో చేరి చెరువులను తలపిస్తుండడంతో పాదచారులు వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఆర్అండ్‌బీ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.