లారీ, కారు ఢీ.. వ్యక్తి మృతి
సత్యసాయి: పెనుకొండ మండలం NH 44 గుట్టూరు క్రాస్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కియా SI రాజేశ్ వివరాల మేరకు.. అనంతపురం వైపు నుంచి పెనుకొండ వైపు లారీ వెళ్తుండగా వెనుకవైపు నుంచి కారు ఢీ కొట్టినట్లు తెలిపారు. ప్రమాదంలో కారు డ్రైవర్ పక్కన కూర్చున్న బీజరపు అంజయ్య (45) తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించారన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.