కురబలకోటలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

కురబలకోటలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

అన్నమయ్య: నాయి బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని TDP బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర యాదవ్, మండలాధ్యక్షుడు సురేంద్ర అన్నారు. బుధవారం నాయి బ్రాహ్మణులు, కూటమి నాయకులతో కలిసి అంగళ్లు 3 రోడ్ల కూడలిలో CM చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.