అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లు సీజ్..!
WGL: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ఆకేరు వాగు పరివాహక ప్రాంతం నుంచి మంగళవారం ఇసుకను తరలిస్తున్నారని సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాలుగు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి, యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.