విమానం కూలడంతో అంధకారంలో 90 గ్రామాలు!

విమానం కూలడంతో అంధకారంలో 90 గ్రామాలు!

మధ్యప్రదేశ్ సివనీలో శిక్షణ విమానం కూలిన విషయం తెలిసిందే. ఈ విమానం అమ్గావ్ పొలాల సమీపంలోని హైటెన్షన్ తీగలను ఢీకొట్టింది. దీంతో విద్యుత్ తీగలు తెగడంతో దాదాపు 90 గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికనా తీగలను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు.