VIDEO: కూలిన కల్వర్టు.. నిలిచిపోయిన రాకపోకలు
NLR: పొదలకూరు మండలంలోని డేగపూడి రాజుపాలెం వద్ద కల్వర్టు మంగళవారం రాత్రి కూలిపోవడంతో రాపూరు పొదలకూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆర్ అండ్ బి అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, తాత్కాలికంగా మరమ్మతు పనులు ప్రారంభించారు.