రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NRPT: మద్దూరు మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు పనుల సందర్భంగా విద్యుత్ స్తంభాలు, వైర్ల పనులు చేపట్టనున్నారు. ఈ కారణంగా మద్దూర్ ఫీడర్ పరిధిలోని గోకుల్ నగర్, కొత్తపల్లి, వీరారం గ్రామాలలో ఆదివారం రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని కొత్తపల్లి ఏఈ బాలరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.