సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

SKLM: కంచిలి మండలం పురుషోత్తపురం గ్రామపంచాయతీకి చెందిన మొగిలి హెలిస్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ మేరకు ఈ విషయం కంచిలి TDP మండల అధ్యక్షుడు మాదిన రామారావు MLA అశోక్ బాబుకు వివరించడం జరిగింది. దీనిపై ఎమ్మెల్యే స్పందించి చెక్కు వచ్చే విధంగా చేశారు. ఈ మేరకు మంగళవారం బాధితుడికి MLA అశోక్ బాబు చేతుల మీదుగా 52,000 రూపాయలు చెక్కును అందజేశారు.