'కాంగ్రెస్ శ్రేణులే ఇలా అంటే!'.. కేటీఆర్
TG: Dy CM భట్టి విక్రమార్క కుమారుడి పెళ్లిలో తనకు వింత అనుభవం ఎదురైందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలిపారు. అక్కడ దాదాపు 100-150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు తనతో కరచాలనం చేసి, 'వచ్చేది మీ ప్రభుత్వమే' అని అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పారని ఆయన వెల్లడించారు. సొంత పార్టీ శ్రేణులే ఇలా ఉన్నారంటే, సామాన్య ప్రజల్లో ప్రభుత్వంపై ఇంకెంత ఆక్రోశం ఉందో అర్థం చేసుకోవచ్చని KTR పేర్కొన్నారు.