వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
MLG: వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం ధర్మ, సీసీ భీమానాయక్‌లు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం కేటాయించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని అమ్మాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.