120 పశువులకు టీకాలు వేసిన అధికారులు

120 పశువులకు టీకాలు వేసిన అధికారులు

JGL: వెల్గటూర్ మండలం జగదేవ్‌పేట గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు వేశారు. మొత్తం 82 ఆవులు, ఎడ్లు మరియు 38 గేదెలకు టీకాలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్ల తిరుపతి, ఉపసర్పంచ్ కొర్రి గంగయ్య, రైతులు పాల్గొన్నారు. పశువైద్య సిబ్బంది డాక్టర్ పి. శ్రీప్రియ ఆధ్వర్యంలో టీకాలు విజయవంతంగా నిర్వహించారు.