VIDEO: ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన
ప్రకాశం: పామూరు మండలంలోని డివిపల్లి గ్రామంలో శనివారం అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు మహిళలు వేసిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.