VIDEO: తడిసిన మొక్కజొన్న ధాన్యం
WGL: పర్వతగిరి(M)లోని పంతిని ఐకేపీ సెంటర్‌లో అకాల వర్షం అన్నదాతను నిలువునా ముంచింది. 20 రోజులుగా లారీల కోసం ఎదురుచూస్తున్న రైతులకు, నేటి వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది. కళ్లముందే పంట తడిసి ముద్దవుతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. "అధికారుల జాప్యం వల్లే మాకు ఈ గతి పట్టింది" అని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించాలని రైతుల కోరారు.