ఎస్పీఎఫ్ కొత్త సిబ్బందికి విధుల కేటాయింపు

ఎస్పీఎఫ్ కొత్త సిబ్బందికి విధుల కేటాయింపు

SRCL: వేములవాడ భీమేశ్వర ఆలయంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు నుంచి వచ్చిన కొత్త సిబ్బందికి శుక్రవారం విధులను కేటాయించారు. ఏఎస్ఐ మహేందర్ ఈ సందర్భంగా వారికి ఆలయంలో నిర్వర్తించాల్సిన భద్రతా విధులపై అవగాహన కల్పించారు. ఆలయ భద్రతతో పాటు క్యూలైన్లు, ఆలయ పరిసరాలలో భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి వారికి సహకరించే విధంగా సూచనలు చేశారు.