ఎండల మల్లన్న ఆలయంలో భస్మాభిషేకం

SKLM: టెక్కలి మండలం రావివలస గ్రామంలోని శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం భస్మాభిషేకం నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి విభూదితో అభిషేకం నిర్వహించారు. ఆలయ ఈవో జీ.గురునాధరావు పర్యవేక్షణలో స్వామివారి స్వయంభూ లింగానికి విభూదితో ప్రత్యేక అలంకరన చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది ఉన్నారు.