దేశ ప్రజలకు రాష్ట్రపతి ఈస్టర్ శుభాకాంక్షలు
దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈస్టర్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రభువైన ఏసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకునే ఈ పవిత్ర సందర్భం.. సత్యం, ప్రేమ, కరుణ, త్యాగం, క్షమ వంటి విలువలను స్వీకరించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. శాంతి, సోదరభావాన్ని పెంపొందించడానికి మన సంకల్పాన్ని పునరుద్ధరించుకుందాం. మెరుగైన భవిష్యత్ కోసం సమిష్టిగా కృషి చేద్దాం' అని పిలుపునిచ్చారు.