ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన.. అదనపు కలెక్టర్

ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన.. అదనపు కలెక్టర్

BHPL: కాటారం మండల కేంద్రంలోని ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె హాస్టల్ స్థితిగతులు, తరగతి గదులు, స్టోర్ రూం, వంటశాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు, భోజన నాణ్యత గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు ఉన్నారు.