RECORD.. ఐపీఎల్ ఫాస్టెస్ట్ డెలివరీ నమోదు

RECORD.. ఐపీఎల్ ఫాస్టెస్ట్ డెలివరీ నమోదు

గుజరాత్ టైటాన్స్ యువ బౌలర్ అశోక్ శర్మ తన వేగంతో ఐపీఎల్‌లో సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 154.2 KM వేగంతో బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత వేగవంతమైన బాల్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో అశోక్ శర్మ తన నాలుగు ఓవర్ల కోటాలో 37 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.