యూరియా నిల్వలు పుష్కలం: కలెక్టర్
సూర్యాపేట జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు అధైర్యపడొద్దని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ భరోసా ఇచ్చారు. ఇవాళ పిల్లలమర్రి పీఎసీఎస్ ఎరువుల గోదామును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్‌లు, ఈ-పాస్ మిషన్లను పరిశీలించారు. యాసంగికి సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, అవసరమైతే మరిన్ని లోడ్లు తెప్పిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులు ఉన్నారు.