వివాహిత ఆత్మహత్య.. కేసు నమోదు

వివాహిత ఆత్మహత్య.. కేసు నమోదు

GNTR: వివాహిత మృతిపై కేసు నమోదు చేసినట్లు పాత గుంటూరు పోలీసులు తెలిపారు.యాదవ బజారుకి చెందిన వేదశ్రీలత, వెంకటసాయి భార్యభర్తలు. వారిద్దరి మధ్య కొద్దిరోజులుగా గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో వేదశ్రీలత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బుధవారం ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.