శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆదాయం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆదాయం

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి శనివారం భక్తుల రద్దీ కొనసాగుతూ గణనీయమైన ఆదాయం నమోదైంది. వివిధ సేవలు, టికెట్లు, ప్రసాదాల విక్రయాల ద్వారా మొత్తం రూ.5,33,802 ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల ద్వారా రూ.2,43,636, ప్రసాదాల ద్వారా రూ.2,31,500, అన్నదానం ద్వారా రూ.58,666 లభించాయి. భక్తులతో దేవాలయంలో సందడి నెలకొంది.