గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు
MNCL: కాసిపేట్ మండలం తిరుమలాపూర్‌కు చెందిన ఆత్రం శ్రీనివాస్ ఆదివారం తెల్లవారుజామున గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 సమాచారం అందించారు. ఈఎంటీ రాకేశ్, పైలట్ రాజు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వైద్యుల సూచన మేరకు ప్రథమ చికిత్స అందిస్తూ మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.