'నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

SGR: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం ఏరియా కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలు సేకరించాలని కోరారు. వరి, పెసర, పత్తి పంటలు నష్టపోయినట్లు చెప్పారు. ఎకరానికి రూ.10 వేల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.